16/02/2024
ఇంతకుముందు రైతుల ఉత్పత్తులను విక్రయించే విధానాలను కొన్ని చట్టాల రూపంలో తేవడానికి బిజెపి ప్రయత్నించినప్పుడు ఈ చట్టాలు మాకొద్దు ఇది యావత్ భారతవాణి అన్నట్టు కలర్ ఇచ్చి, కొంతమంది పెయిడ్ ఉద్యమకారులు(ప్రధాన పార్టీ స్పాన్సర్ చేసిన ) ,ఆగ్రా ఢిల్లీ మధ్యలో తీష్ట వేసి కొన్ని నెలల పాటు తమ ఆందోళన అంటూ చాలా ఇబ్బందులు కలిగిస్తూ ప్రతి వాహనదారునికి ఇబ్బందులు పెడుతూ డబ్బులు వసూలు చేసినది మనము చూసినాము.ఇప్పుడు మళ్లీ అదే ప్రధాన పార్టీ అండదండలతో కనీసం 6 నెలలు చేయాలన్న ఉద్దేశంతో తిండి పదార్థాలు, ఉండడానికి కొన్ని ట్రక్కులు ,ట్రాక్టర్లు ట్రాలీలను వసతి గృహాలుగా మార్చుకుని ,అక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అది బిజెపికి ఇబ్బంది అవుతుందా,ఇంకొకరికి ఇబ్బంది అవుతుందా అని ప్రశ్నలు వేసిన వాళ్లకు దేశం పట్ల బాధ్యత లేదా! ఇవి దేశానికి మేలు చేస్తాయా కీడు చేస్తాయా, మీకు కీడు కలిగించే చట్టాలను కోర్టు ద్వారా గాని చర్చల ద్వారా గాని పరిష్కరించుకోండి. వీధులు వెంబడి ధర్నాల పేరుతో ఇలా చేసే వాళ్లకు , మీరు అడిగే ప్రశ్నలు ఇంకా ఊతమిస్తాయని మీకు తెలియదా! అసలు ఈ క్వశ్చన్ వేసే వాళ్లకు కొంచెం అయినా బుద్ధి జ్ఞానం ఉందా ఒకసారి మీరే పరిశీలించండి!