29/07/2026
గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎ నియోజకవర్గ ఇన్చార్జ్ రాయల రాము
తల్లాడ మండలంలోని ముద్దునూరు గ్రామంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం స్థానిక సాయిబాబా దేవాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ బిఎల్ఎ ఇంచార్జ్ రాయల్ రాము హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించి రోగులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని కమిటీ నిర్వాహకులను అభినందించారు. ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు అయినాల నరసింహారావు, ఎస్ వి రెడ్డి, వనిగండ్ల శ్రీనివాసరావు, సాధం లక్ష్మణరావు, జి సత్యనారాయణ, అన్నెం కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.