Manasiddipet

Manasiddipet Siddipet Search Engine

Mana Siddipet Search... Education, Politics, Services, Shopping, Business, Hotels, Tourism, Travels, APSRTC, Bus Timings, Siddipet Helpline, Govt.Offices, Temples in Siddipet, Siddipet Photo Gallery, Shopping Siddipet, Education Siddipet, Business Siddipet, Services, Realestate in siddipet

26/02/2018

★ సిద్దిపేట లో పాస్ పోర్ట్ కేంద్రం...

★ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి కృషి...మంత్రి హరీష్ రావు గారి చొరవ తో జిల్లా కేంద్రంలో పాస్ పోర్ట్ కేంద్రం...

★ ఈనెల 28 న ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు గారు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ..

★ రాష్ట్రం ఏర్పడ్డాక వరంగల్ తర్వాత సిద్దిపేట లోనే....

★ పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు తో ప్రజలకు తిరనున్న ఇక్కట్లు...

★ ఆనందం వ్యక్తం చేస్తున్న సిద్దిపేట ప్రజలు ..

సిద్దిపేట కు గతంలో మంజూరీ అయిన పాస్ పోర్ట్ కేంద్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని హెడ్ పోస్టాఫీస్ లో ఏర్పాటు కానుంది..ఈనెల 28న మంత్రి హరీష్ రావు గారు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు ...అసులు పాస్ పోర్ట్ కావాలి అంటే హైద్రబాద్ ,కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వారు..ఉదయం వెళ్తే రోజుంత క్యూ కట్టి నిలబడే పరిస్థితి ఉండేది...అలాంటి పరిస్థితిని ప్రజల ఇబ్బందులను మంత్రి హరీష్ రావు గారు గ్రహించారు పలు మార్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు...అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి కూడా దృష్టి కి తీసుకెళ్లారు.....

★ *ఎంపీ కృషి ఫలితం...*

- గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సిద్దిపేట లో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు లో నిరంతర కృషి చేసారు..మంత్రి హరీష్ రావు గారు కోరడం తో ఎంపీ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్లిన సిద్దిపేట పాస్ పోర్ట్ కేంద్రం కావాలని...కేంద్ర మంత్రిని కలుస్తూ... సిద్దిపేట ప్రజలు ఇబ్బందులు ...జరిగిన అభివృద్ధి ని ,పెరిగిన జనాభా ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చి పాస్ పోర్ట్ కేంద్రం మంజూరు చేపించారు...గత ఏడాది లో కేంద్ర టెలికాం శాఖ మంత్రి ని కలిసి పాస్ పోర్ట్ కేంద్రం నూతన కార్యాలయం ,మౌలిక వసతులు కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు...ఇలా నిరంతరం సిద్దిపేట పాస్ పోర్ట్ ఏర్పాటు లో పర్యవేక్షణ చేస్తు కృషి చేసారు.....

★ *కొత్త రాష్ట్రం వరంగల్ తర్వాత... సిద్దిపేట లో పాస్ పోర్ట్ కేంద్రం...*

- ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైద్రబాద్ , కరీంనగర్ లలో మాత్రమే పాస్ పోర్ట్ కేంద్రాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఎంపిల కృషితో మొదటి దశలో వరంగల్ , మహాబుబ్ నగర్ లో ప్రారంభం కాగా రెండవ దశలో సిద్దిపేట జిల్లా తో పాటు తదితర జిల్లాలో మంజూరు అయ్యాయి... వరంగల్ లో ఇటీవల ప్రారంభం కాగా సిద్దిపేట లో 28న ప్రారంభం కానుంది.....హైద్రబాద్ ,కరీంనగర్ ,వరంగల్ తరహాలో సిద్దిపేట లో పూర్తి స్థాయిలో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు కానుంది....

- ప్రజల కష్టాలకు చెక్...

- 28నుండి ఆన్లైన్ అప్లికేషన్ లు.

- అన్ని సౌకర్యాలతో ఏర్పాటు ..
సిద్దిపేట లో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు తో ప్రజల కష్టాలకు చెక్ పడనుంది....పై చదువుల కు ,ఉద్యోగల రీత్యా వేరే దేశాలకు వెళ్లాలి అంటే పాస్ పోర్ట్ అత్యవసరం...ఇతర దేశాలకు వెళ్లాలి అంటే వెళ్లడం ఇబ్బంది కాదు కానీ పాస్ పోర్ట్ తీయడం.. రావడం ఇబ్బంది గా మారింది... అలాంటి ఇబ్బందులను తొలగించే దిశగా సిద్దిపేట లోనే పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేసి మంత్రి హరీష్ రావు గారు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల కష్టాలకు చెక్ పెట్టారు....ఈ నెల 28న ప్రారంభం అయ్యే పాస్ పోర్ట్ కేంద్రం లో అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి...ఆన్ లైన్ లో చేసుకునే వారికి ₹1500రూపాయలు ,సీనియర్ సిటిజన్ లకు ₹1350 రూపాయలు చార్జీలు ఉంటాయ్...ఈ పాస్ పోర్ట్ కేంద్రం అన్ని సౌకర్యాలతో ఏర్పాటు కానుడటం తో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ...మంత్రి హరీష్ రావు గారికి ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలువుతున్నారు

16/02/2018
25/09/2017

*గొప్ప అవకాశం....*

పాత బస్టాండ్ ఇక మోడల్ బస్టాండ్ ...మల్టీప్లెక్స్... షాపింగ్ కాంప్లెక్స్ గేమింగ్ జోన్ ఏర్పాటు ..

పాత బస్టాండ్ ని తీసివేయుటకు వాటి నిర్మాణ పనులకు విడుదలైన టెండర్ నోటిఫికేషన్....

లీజ్ తీసుకోనుటకు
ఇది గొప్ప అవకాశం...ఔత్సాహికులు..ఉత్సహ వంతులు... టెండర్ ప్రక్రియ లో పాల్గొనవచ్చు... సిద్దిపేట అభివృద్ధి లో బాగస్వమ్యం కావచ్చు...
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

25/06/2017

#సిద్దిపేట క్లాక్ టవర్ నమూన

28/04/2017
19/03/2017

Address

10-1-166/7, Mangammathota
Siddipet
502103

Alerts

Be the first to know and let us send you an email when Manasiddipet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Manasiddipet:

Share