SRI Amulya Mess A/C Tanuku

SRI Amulya Mess A/C Tanuku Hi friends this Rajesh varma from tanuku i proud to say we have running a successful mess in our tow

10/11/2020
23/10/2018

Wishing you joy and prosperity this Diwali

చేకూరి  సూర్యనారాయణరాజు స్వాతంత్య సమరంలో గొప్ప పోరాటయోధుడు.మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామ్రపత్రం అందు...
19/07/2018

చేకూరి సూర్యనారాయణరాజు స్వాతంత్య సమరంలో గొప్ప పోరాటయోధుడు.మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామ్రపత్రం అందుకొన్నారు.తామ్రపత్రం అంటే స్వాత్రంత్య పోరాటయోధులకు ఇచ్చే విశిష్ట పురస్కారం.

పచ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణం లో సూర్యనారాయణరాజు గారు 1926 లో "రాజ్ విలాస్" అనే భోజన హోటల్ ప్రారంబించారు.ప్రజల అవసరాలు తీర్చడం లోనే తన ఉపాది కుడా ఉండాలి అనుకునేవారు.తణుకులో మొట్టమొదటి నాన్-వెజ్ హోటల్ "రాజ్ విలాస్" కావటం విశేషం.1926 లో స్తాపించిన ఈ హోటల్ 1983 వరకు నిర్విగ్నంగా సాగింది.1983 లో శ్రీ సూర్యనారాయణరాజు గారు స్వర్గస్తులైనారు.

సూర్యనారాయణరాజు గారి కుమారుడు శ్రీ సత్యనారాయణరాజు ఆయన సతీమణి లక్ష్మిగారు,అయన కుమారుడు రాజేష్ వర్మ కలిసి సమిష్టి ఆలోచనతో సదరు "రాజ్ విలాస్" ను పేరు మార్చి పూర్తి స్తాయి సాంప్రదాయ బ్రాహ్మణ భోజన పద్దతులతో "అమూల్య మెస్" గా ప్రారంభించారు.ప్రతినిత్యం 22 వంటకాలతో ఇకచాలు అనే వరకు వడ్డించటం వీరి ప్రత్యేకత.

తన కుటుంబ సభ్యుల సహాయ,సహకారాలతోనే అందరికి సంతృప్తి కలిగే విదంగా "అమూల్య మెస్"ను నడపగాల్గుతున్నని ఆయన చెబుతూ ఉంటారు.

ప్రతిరోజూ కొంతమందికి ఉచితంగా భోజనం పెట్టడం అనేది సత్యనారాయణరాజు గారి దాతృత్వానికి నిదర్సనం.ఈ విషయం లో అయన సతీమణి ని లక్ష్మిగారు అని పిలిచే కన్నా అన్నపూర్ణాదేవి అని పిలిస్తే సబబుగా ఉంటుంది.

మన పెద్దలు అంటుంటారు....సంవత్సరానికి ఒక్కసారి అయిన బ్రాహ్మణ భోజనం తినాలి అని.కాని సంవత్సరం మొత్తం అలాంటి భోజనం అందిస్తున్న సత్యనారాయణరాజు గారికి అభినందనలు.

మీ తండ్రిగారి దేశభక్తి స్పూర్తితొ మీరు చేసే సేవా శక్తి వల్ల మీరు ఇంకా అభివృద్ధి సాదించి,మీ "అమూల్య మెస్" రాష్ట్రస్తాయిలో గుర్తింపు సాదించాలని ఆశిస్తున్నాం.

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చా...
30/08/2017

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి.

శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.
వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.
ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.
ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు.
వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి.
అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను.

ఇన్ని రకములయిన ప్రయోజనాలు ఉండటం వలన అరటి ఆకు భోజనం అనేది ఘనమయిన భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు. అంత మంచి, మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో అని వాడడం జరిగినదని నా అభిప్రాయం. ఇహ కన్న వాళ్ళకి కంచాలు అంటే ఇది వరకు అందరూ ఇంట్లో వాళ్ళు వెండి కంచం మధ్యలో బంగారు పువ్వు ఉన్న కంచాలలో భోజనం చేసేవారు. ఇది కూడా విషాన్ని హరిస్తుంది. అటువంటి పనిని చేసేది కేవలం మన అరటి ఆకు కనుక దానిని మనం అయిన వాళ్లకి పెడతాము. బహుశా పూర్వ కాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయుట వలెనే ఆ కాలం వాళ్ళు అంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారేమో!

అరటి ఆకులో, అడ్డాకు (విస్తరాకు) లో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది. బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్త్, వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది. ఇది నిజమో లేక కల్పనో తెలియదు కాని మన అరటి ఆకుని మించిన ఆకు లేదు.

28/05/2017
🔯☘🌹🌻☝卐 ఓం గం గణపతయే నమః 卐☝🌻🌹☘🔯  ⚛ ॐ 🌼 🌺 🐘 ॥ ఓం గణేశాయ నమః ॥ 🐘 🌺 🌼 ॐ ⚛☸🐀 👏 ॥ॐ॥! ఓం విఘ్నేశ్వరాయ నమః ! ॥ॐ॥ 👏🐀☸🌹🙌 శ్రీ వినా...
05/09/2016

🔯☘🌹🌻☝卐 ఓం గం గణపతయే నమః 卐☝🌻🌹☘🔯

⚛ ॐ 🌼 🌺 🐘 ॥ ఓం గణేశాయ నమః ॥ 🐘 🌺 🌼 ॐ ⚛

☸🐀 👏 ॥ॐ॥! ఓం విఘ్నేశ్వరాయ నమః ! ॥ॐ॥ 👏🐀☸

🌹🙌 శ్రీ వినాయుకుని ఆశీస్సులు మీ పై వుండాలని, ఈ రోజు మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తూ 🙌🌹

👪 మీకు మీ కుటుంబసభ్యులకు బంధుమిత్రులందరికీ
శ్రేయోభిలాషులకు👪

🌴🌻🍄వినాయక చవతి శుభాకాంక్షలు🍄🌻

14/06/2016

Address

Tangiralla Vari Street
Tanuku
534211

Telephone

9848455665

Website

Alerts

Be the first to know and let us send you an email when SRI Amulya Mess A/C Tanuku posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category