24/05/2025
తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి టీటీడీ పట్టణ ప్రణాళిక శాఖ ఏర్పాటు ….
• ఇటీవలే పలు పోస్టుల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది.
• దీనితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్ఛర్ కన్సెల్టెన్సీల ద్వారా టీటీడీలో అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
మొదటి దశలో...
• తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, నాగాలాపురం వేదనారాయణస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం, తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు చేపట్టాం.
మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు:
• భక్తులకు మరింత నాణ్యంగా, రుచికరంగా ఆహార పదార్థాలు అందించేందుకు తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించాం.
• ఆదాయంతో సంబంధం లేకుండా నిర్వాహకుల సామర్థ్యాన్ని బట్టి, పేరొందిన సంస్థలకు కేటాయించడానికి త్వరలోనే టెండర్లను పిలుస్తాం.
మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు:
• సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మరింత పారదర్శకంగా, సులభతరంగా, త్వరితగతిన సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, FMS MONITORING, WHATSAPP GOVERNANCE , గూగుల్ తో ఒప్పందం, ఆధార్ నమోదు, కియోస్క్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
అభిప్రాయ సేకరణ:
• భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఫీడ్ బ్యాక్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చాం.
• ఈ విధానం ద్వారా పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడింది.
తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ:
• తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెల్లిన వసతి గృహాల పునఃనిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం.
ఆహార నాణ్యత పెంచేందుకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్:
• టీటీడీ భక్తులకు మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
• తిరుమలలో 12వేల చదరపు అడుగుల స్థలంలో ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం.
• టీటీడీలో అన్నప్రసాదాల తయారీకి ఉపయోగించే పప్పు దినుసుల నాణ్యత పెంచేందుకు నిపుణుల సహకారం తీసుకుంటున్నాం.
• ఇందుకోసం రిలయన్స్ రీటైల్ సంస్థ ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు రావడంతో ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.
గోశాలపై ప్రత్యేక దృష్టి:
• టీటీడీ గోశాలలో గోసంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
• గోవులు, లేగ దూడలకు రోజువారీ అందిస్తున్న నాణ్యమైన దాణా, పశుగ్రాసం అందించేందుకు చర్యలు చేపట్టాం.